నువ్వుల పూయిస్తున్న ‘అంటే సుందరానికీ’ ట్రైలర్‌..

-

న్యాచురల్‌ స్టార్‌ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం అంటే సుందరానికీ. వెరైటే టైటిల్‌తోనే సినిమాపై ఆసక్తి పెంచేశాడు దర్శకుడు వివేక్‌ ఆత్రేయ. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ రిలీజైంది. ఇందులో నాని అమాయకపు బ్రాహ్మణుడిగా కనిపిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తున్నారు. నాని రీసెంట్ గా శ్యామ్ సింగరాయ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  ప్రస్తుతం ఈ చిత్రయూనిట్ స్పెషల్ ప్రమోషనల్ కంటెంట్తో సందడి చేస్తోంది. వివేక్ సాగర్ స్వరపరిచిన ఈ చిత్రంలోని ఫస్ట్ సింగల్ పంచెకట్టు, సెకెండ్ సింగల్ ఎంత చిత్రం పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.

Ante Sundaraniki Trailer Launch Event Trailer | Nani, Nazriya Fahadh | Shreyas Media - YouTube

మొనీమధ్య రిలీజ్ అయిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తెలుగులో తొలిసారిగా నజ్రియా నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించాయి. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటుంది. సుందరం పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించి అలరించారు నాని. ఈ చిత్రంలో నాని సుందర్ అనే బ్రాహ్మణ అబ్బాయి పాత్రలో నటిస్తుండగా, నజియా క్రిస్టియన్ అమ్మాయి లీలాగా కనిపించనున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news