ఆస్ట్రేలియా నూతన ప్రధానికగా ఆంటోని అల్బనీస్‌

-

శనివారం జరిగిన పార్లమెంట్‌ ఎన్ని‌కల్లో ప్రధాని స్కాట్‌ మారి‌సన్‌ నేతృ‌త్వం‌లోని లిబ‌ర‌ల్-‌నే‌ష‌నల్‌ కూటమిపై విపక్ష లేబర్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆంటోని అల్బనీస్‌ ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు. మొత్తం 151 స్థానాలకుగాను 72 స్థానాల్లో గెలుపొందింది. మారిసన్‌ పార్టీ కేవలం 52 స్థానా‌లకే పరిమితం కాగా, ఏడుగురు ఇండిపెండెంట్లు గెలుపొందారు. దీంతో ఆస్ట్రేలియా 31వ ప్రధానిగా ఆంటోని బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, ప్రధాన మంత్రి స్కాట్‌ మోరిసన్‌ తన ఓటమిని అంగీకరించారు. అల్బనీస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 2007 తర్వాత లేబర్‌ పార్టీ అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

అల్బనీస్‌ 1963లో జన్మించారు. 1996తో తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2013లో ఉప ప్రధానిగా కొంతకాలం పనిచేశారు. 2019 నుంచి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. కాగా, ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా ఎన్నికైన అల్బనీస్‌కు పీఎం మోదీ అభినందనలు తెలిపారు. అల్బనీస్ సర్కారుతో పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో ఇరుదేశాల ప్రయోజనాలపై కలిసికట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు ఆంటోని అల్బనీస్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version