రాత్రి వచ్చేదే దానికోసం… అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్…!

-

అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనుపమ పరమేశ్వరన్ మలయాళ సినిమా ప్రేమమ్ తో వెండితెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు ఇతర భాష బాషా నుండి కూడా మంచి అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా టాలీవుడ్ వైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ ఆ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా అనుపమ పరమేశ్వరన్ అందచందాలకు, నటనకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు తగ్గడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి.

అందులో భాగంగా అనేక టాలీవుడ్ సినిమాలలో నటించిన అనుపమ పరమేశ్వరన్ తెలుగునాట తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దుగుమ్మ నటించిన రౌడీ బాయ్స్ సినిమా థియేటర్ లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అలాగే ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న 18 పేజిస్, కార్తికేయ టు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ ఇక ఇప్పుడు వీకెండ్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. వైన్ కోసమే రాత్రి వస్తుంది.. పక్కకు జరగండి.. నా పిక్స్ చూపించాలి అని అనుకోవడం లేదు.. అంటూ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news