బాలీవుడ్​ చేసే తప్పు అదే.. అందుకే ఫెయిల్​ అవుతోంది: అనుపమ్​ ఖేర్

-

బాలీవుడ్‌ వర్సెస్‌ సౌత్‌ సినిమా అనే అంశంపై ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ స్పందించారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది చిత్రాలు విజయాలు, హిందీ సినిమాలు వరుసగా పరాజయం పొందుతుండటంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

దక్షిణాది వారు కథకి ప్రాధాన్యతనిస్తే, బాలీవుడ్‌ వాళ్లు కేవలం స్టార్‌లపైనే దృష్టిసారిస్తున్నారని అన్నారు. సమష్టి కృషి వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుగు సినిమాల ద్వారా నేర్చుకున్నానని, ఇటీవల ఓ తెలుగు చిత్రాన్ని, ఓ తమిళ చిత్రాన్ని పూర్తి చేశానని తెలిపారు. ఓ మలయాళ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నానన్నారు. నార్త్‌ వర్సెస్‌ సౌత్‌ డిబేట్‌పై కిచ్చా సుదీప్‌, అజయ్‌దేవ్‌గణ్‌ల మధ్య కొన్ని నెలల క్రితం ట్వీట్‌ వార్‌ జరిగిన విషయం తెలిసిందే. ‘మా సినిమా గొప్పంటే.. మా సినిమానే గొప్ప’ అని వారిద్దరూ వారించారు. ఆ తర్వాత ఈ అంశం సినీ పరిశ్రమలో హైలెట్‌ అయింది. అలా.. ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రముఖ నటులకు ఈ టాపిక్‌పై ప్రశ్న ఎదురవుతూనే ఉంది.

సుదీప్- అజయ్ దేవ్‌గణ్
సుదీప్- అజయ్ దేవ్‌గణ్

 

బాలీవుడ్‌ నటుడే అయినప్పటికీ అనుపమ్‌ ఖేర్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. 1987లో ‘త్రిమూర్తులు’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారాయన. మళ్లీ ఇన్నేళ్లకు కార్తికేయ 2 తో తెలుగు వారిని నేరుగా పలకరించారు. నిఖిల్‌ హీరోగా చందు మొండేటి తెరకెక్కించిన చిత్రమిది. ఇటీవల విడుదలైన ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఓటీటీ వేదికగా ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’తోనూ అనుపమ్‌ దక్షిణాది ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేశారు.

Read more RELATED
Recommended to you

Latest news