అవన్నీ ఆధారం లేనివి.. పాయల్ ఆరోపణలపై అనురాగ్ కామెంట్..

-

డ్రగ్స్ కేసులు, లైంగిక ఆరోపణలు, విమర్శలు, బంధుప్రీతిపై చర్చలు, బాలీవుడ్ ని ఊపిరాడకుండా చేసేస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా బాలీవుడ్ పై అనేక విమర్శలు వస్తున్నాయి. నెగెటివ్ ప్రచారాలతో ఇండస్ట్రీపై అభిప్రాయం మారిపోతుంది. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. టాప్ డైరెక్టర్ అయిన అనురాగ్ కశ్యప్ తనని లైంగికంగా వేధించాడంటూ, హీరోయిన్ పాయల్ ఘోష్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి తనని వేధింపులకి గురి చేసాడని పేర్కొంది.

ఈ విషయమై తాజాగా అనురాగ్ స్పందించాడు. పాయల్ ఘోష్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి. కేవలం నా నోరు మూయించడానికే కావాలనే ఇలాంటివన్నీ చేస్తున్నారని అంటున్నాడు. సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నందున రోజూ చాలా మంది ఆడవాళ్ళతో పనిచేయాల్సి వస్తుందని, వారందరికీ నేను చాలా గౌరవం ఇస్తానని, ఇలాంటి ఆధారాలు లేని ఆరోపణల గురించి తాను పట్టించుకోనని చెప్పాడు. ఇంకా ఒక మహిళ, మరో మహిళతో ఇదంతా చేయిస్తున్నట్టు అనిపిస్తుందని అన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version