చలికాలంలో ఈ 4 పండ్లను తీసుకుంటే.. బరువు కంట్రోల్ లో ఉంటుంది..!

-

చాలా మంది అధిక బరువు కారణంగా బాధపడుతూ ఉంటారు. అధిక బరువు సమస్యతో బాధ పడుతున్నట్లయితే చలికాలంలో దొరికే ఈ పండ్లను తీసుకోండి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది. చలికాలంలో ఈ పండ్లను తీసుకోవడం వలన బరువు బాగా కంట్రోల్ అవుతుందట. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, నీటి శాతం ఈ పండ్లలో ఎక్కువగా ఉంటాయి. ఆకలి కూడా అదుపులో ఉంటుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా కడుపు నిండుగా ఉంటుంది. ఇందులో ఉండే నీటి శాతం బరువు కంట్రోల్ చేయడానికి అవుతుంది. హైడ్రేట్ గా ఉండొచ్చు. బ్లోటింగ్ వంటి బాధలు కూడా ఉండవు. ఈ పండ్లు రుచిగా కూడా ఉంటాయి. కాబట్టి శీతాకాలంలో వీటిని తీసుకోవడం మంచిది.

బరువు తగ్గాలనుకుంటే శీతాకాలం ద్రాక్ష పండ్లను తీసుకోండి. వీటిలో కేలరీలు తక్కువ ఉంటాయి. సిట్రస్ పండ్లు అయినటు వంటి ద్రాక్షను తీసుకుంటే విటమిన్ ఏ బాగా అందుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. దానిమ్మ పండ్లు కూడా ఆరోగ్యానికి మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

ఇంఫ్లమేషన్ కి దూరంగా ఉండొచ్చు. అలాగే కొవ్వు బాగా కరుగుతుంది. బరువు అదుపులో ఉంటుంది. ఆపిల్ పండ్లు కూడా హెల్త్ కి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. మెటాబాలిజం ని బూస్ట్ చేయడానికి అవుతుంది. బరువు అదుపులో ఉంటుంది. నిమ్మ, ఆరెంజ్ వంటి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే కూడా హెల్త్ బావుంటుంది. ఇందులో ఉండే విటమిన్ సి హెల్త్ కి చాలా మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version