మెగాస్టార్ చిరంజీవికి జోడీగా అనుష్కశెట్టి!

-

మెగా స్టార్ చిరంజీవి వ‌రుస సినిమాల‌తో జోరుగా ఉన్నారు. అయితే ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి ఒక కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఛ‌లో, భీష్మ వంటి సినిమాల‌తో మంచి ఫామ్ లో ఉన్న డైరెక్ట‌ర్ వెంకీ కుడుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయ‌నున్నారు. ఈ సినిమాకు ప్ర‌ముక‌ టాలీవుడ్ నిర్మాత దాన‌య్య నిర్మించ‌నున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌కట‌న కూడా ఇటీవ‌ల వ‌చ్చింది.

అయితే ఈ చిత్ర బృందం ప్ర‌స్తుతం హీరోయిన్ వేట‌లో ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాలో చిరంజీవికి జోడీ గా స్టార్ హీరోయిన్ శృతి హాస‌న్ ఎంపిక చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కానీ అందులో నిజం లేద‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ సినిమాలో మెగా స్టార్ చిరంజీవి స‌ర‌స‌న స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టిని చిత్ర బృందం ఎంపిక చేసిన‌ట్టు సోష‌ల్ మీడియాలో, ఫీల్మ్ న‌గ‌ర్ లో ఈ వార్త తెగ చెక్క‌ర్లు కొడుతుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఇంకా రావాల్సి ఉంది. అయితే దాదాపు ఈ సినిమాకు మెగా స్టార్ చిరంజీవికి జోడీగా న‌టించేది అనుష్క నే తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news