బంగార్రాజు వచ్చేస్తున్నాడు..!

-

2016లోని సంక్రాతికి విడుదలై ఘన విజయాన్ని అందుకున్న సోగ్గాడే చిన్నినాయనా సినిమాకి సీక్వెలే మన బంగార్రాజు. దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ కురసాలకు సోగ్గాడే చిన్నినాయనా మొదటి చిత్రంకాగా… నాగార్జున స్వీయ నిర్మాణంలో నిర్మితమై సంక్రాతి బరిలో నిలిచి భారీ విజయాన్ని అందుకుంది. సోగ్గాడే చిన్నినాయనా కథ రాసుకున్నప్పుడే దీనికి సీక్వెల్ కూడా సిద్ధం చేశారంటా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. అయితే ఈ మధ్యలో ఆయన రారండోయ్ వేడుక చూద్దాం, నేల టిక్కెట్ సినిమాలతో బిజీగా ఉండి సోగ్గాడే చిన్నినాయనా సీక్వెల్ కు బ్రేక్ పడింది.

ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్ గా తెరకెక్కిన సోగ్గాడే చిన్నినాయనా విజయం సాధించడంతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ అందరిచే శభాష్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం వస్తున్న బంగార్రాజు సోగ్గాడే చిన్నినాయనాకు సీక్వెల్ గా రావడంతో దర్శకుడు కథను ఏవిధంగా మలిచారోనని తెలుగు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. సొగ్గాడే చిన్నినాయనాకు సీక్వెల్ కాబట్టి దానిలోని నటీనటులనే దర్శకుడు ఎక్కువుగా తీసుకున్నారు. కాకపోతే దీనిలో ప్రధాన ఆకర్షణగా నిలిచేది మాత్రం నాగ చైతన్య, కృతి శెట్టిల జంట అని దర్శకుడు చెబుతున్నారు.

ఉప్పెనతో హీరోయిన్ గా పరిచయమై వరుస సినిమాలతో బిజీగా మారిన కృతి బంగార్రాజులో నాగచైతన్యకు జంటగా నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వలో వచ్చిన లవ్ స్టోరి మంచి విజయాన్ని సాధించడంతో అంతే ఉత్సాహంగా నాగచైతన్య బంగార్రాజు రిలీజ్ కు సిద్ధమయ్యారు. సీక్వెల్ కు కూడా నాాగార్జునే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నాగార్జునకి జోడిగా రమ్యకృష్ణ నటించారు. ఈ సినిమాకి సంగీతం అనూప్ రూబెన్స్ అందించారు. అయితే బంగార్రాజు సంక్రాంతి రేసులో రేసుగుర్రంలా దూసుకురానుంది. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు వాయిదాలు పడగా… బంగార్రాజుకు సంక్రాంతి కలిసొచ్చేలా కనిపిస్తుంది. ఈ నెల 14వ తేదీన బంగార్రాజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని మంచిటాక్ సంపాదించిన బంగార్రాజు ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో చూడాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Latest news