వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖలో కొత్త ఉద్యోగాల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు సమాచార శాఖ మంత్రి పేర్ని నాని. 1285 కొత్త ఉద్యోగాలు, 560 అర్బన్ హెల్త్ క్లినిక్కుల్లో ఫార్మాసిస్టుల పోస్టుల కల్పనకు అంగీకారాన్ని తెలిపిందన్నారు పేర్ని నాని. మెడికల్ కళాశాలలో 2190 మందిని నియమించుకునేందుకు వీలుగా మంత్రి మండలి నిర్ణయం తీసుకుందన్నారు. మొత్తంగా 4035 కొత్త ఉద్యోగాల కల్పనకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు పేర్ని నాని.
వైద్యా రోగ్య శాఖలో 41,308 ఉద్యోగాల భర్తీకి లక్ష్యంగా ఉంటే 26,917 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 చోట్ల పర్యాటక లగ్జరీ హోటళ్ల నిర్మాణం కోసం అనుమతి ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా వాడ్రేవులో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కోసం డీపీఆర్ కు పాలనానుమతి ఇచ్చిందని…విశాఖలో ఆదాని డేటా సెంటర్ ఏర్పాటు కోసం 130 ఎకరాలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. జేఎన్టీయూ కాకినాడ-గురజాడ విశ్వవిద్యాలయం విజయనగరంలో- ఆంధ్ర కేసరి విశ్వద్యాలయం ప్రకాశం జిల్లాలో ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. రాష్ట్రంలో తక్షణమే 8 వేల కిలోమీటర్ల రహదారుల నిర్వహణకు 1176 పనులను రూ. 2,200 కోట్లను వ్యయం చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన చేశారు.
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే విజయపథం.కామ్ వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి.