లైవ్ వీడియో పెట్టి మిస్ తెలంగాణ ఆత్మ‌హ‌త్య‌య‌త్నం..!

-

2018లో మిస్ తెలంగాణ‌గా ఎంపికైన హాసిని అనే యువ‌తి ఆత్మ‌హ‌త్య‌య‌త్నం చేసింది. హాసిని నారాయ‌ణ గూడ పీఎస్ ప‌రిధిలో కుటుంబంతో క‌లిసి నివాసం ఉంటుంది. కాగా తాను ఆత్మహ‌త్య చేసుకుంటున్నాన‌ని హాసిని సోష‌ల్ మీడియాలో లైవ్ వీడియో పోస్ట్ చేసింది. దాంతో ఆమె స్నేహితులు వెంట‌నే డ‌య‌ల్ 100 ఫోన్ చేసి స‌మాచారం ఇచ్చారు. దాంతో నారాయ‌ణ గూడ పోలీసులు హిమాయ‌త్ న‌గ‌ర్ లోని రోడ్ నంబ‌ర్ 6లో త‌న ఫ్లాట్ కు వెళ్లి ర‌క్షించారు. అనంత‌రం హైద‌ర్ గూడ‌లోని అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ప్ర‌స్తుతం యువ‌తి ఆరోగ్యం మెరుగ్గానే ఉన్న‌ట్టు వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండ‌గా 2018లో మిస్ తెలంగాణ‌లో ఎంపికైన హాసిని సోష‌ల్ మీడియాలోనూ అభిమానుల‌ను సంపాదించుకుంది. అయితే ఇటీవ‌ల హాసిని త‌న‌ను ఓ యువ‌కుడు శారీర‌కంగా వేధిస్తున్నాడంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఇంత‌లోనే ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. ఇక స‌రైన స‌మయంలో స్నేహితులు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డం..వెంట‌నే పోలీసులు వెల్ల‌డంతో యువ‌తి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది.

Read more RELATED
Recommended to you

Latest news