ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. వారికి శుభవార్త!

-

ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత ఏపీ కెబినెట్ భేటీ కానుంది. మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు ప్రతిపాదనపై ఈ సందర్భంగా చర్చించనుంది ఏపీ మంత్రి వర్గం. అలాగే కొన్ని ప్రభుత్వ విభాగాల్లో కొత్త ఉద్యోగాలను ఏర్పాటు చేసే అంశంపై కెబినెట్లో ప్రతిపాదనలు రానున్నాయి. స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఏర్పాటుపై చర్చించనున్న రాష్ట్ర మంత్రి వర్గం… ఆర్గానిక్ ఫార్మింగ్ ఉత్పత్తుల విషయంలో ప్రమాణాలను నిర్దేశించే అంశంపై ఈ అథారిటీ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచరం.

Jagan
Jagan

ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ఈ తరహా అథారిటీలు ఉన్నట్టు గుర్తించిన ప్రభుత్వం… ఆర్గానిక్ ఫాంగా గుర్తించిన సంస్థలు మాత్రమే ఉత్పత్తులు విక్రయించేలా కొత్త విధానం రూపొందించనుంది. ఆసరా రెండో విడత మొత్తాన్ని విడుదల చేసే అంశానికి ఆమోదం తెలపనున్న కెబినెట్… గృహలు మంజూరైన లబ్దిదారులకు రూ. 35 వేల అదనపు రుణాన్ని ఇచ్చే ప్రతిపాదనపై చర్చించనుంది. పాఠశాలలు, ఆస్పత్రుల పునర్ నిర్మాణానికి ఆర్దిక సాయం అందించే దాతల పేర్లను పెట్టేందుకు వీలుగా కొత్త విధానాన్ని తీసుకొచ్చే అంశంపై నిర్ణయం తీసుకోనుంది మంత్రి వర్గం. విశాఖలో ఏకలవ్య పాఠశాల ఏర్పాటు ప్రతిపాదన పై చర్చించనున్న కేబినెట్… బద్వేలు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు ప్రతిపాదనపై చర్చించనుంది కేబినెట్.

Read more RELATED
Recommended to you

Latest news