ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా.. 24 గంటల్లో 2050 కేసులు

-

చైనాలో పురుడు పోసుకున్న కరోనా ఏపీని వదలడం లేదు. ఏపీ లో కరోనా మహమ్మారి కేసులు తగ్గుతూ, పెరుగుతూ వస్తునే ఉన్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఈ రోజు కాస్త పెరిగాయి కరోనా కేసులు. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2050 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,79,413 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 18 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13,531 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,949 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 2458 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 85,283 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 51, 93, 429 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అటు ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,45,933 లక్షలకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news