వ్య‌వ‌సాయ రంగానికి జ‌గ‌న‌న్న శుభ‌వార్త

-

వ్య‌వ‌సాయ రంగానికి అన్ని విధాలా ఊత మిచ్చేందుకు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు యువ ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ముఖ్యంగా సహ‌జ సిద్ధ విధానానికి, స‌హ‌జ సేద్యానికి మంచి ప్రాముఖ్యమిస్తున్నారు. గ‌తం క‌న్నా ఈ ఏడాది ఖ‌రీఫ్ సీజ‌న్ మే మూడో వారంలో కానీ మే చివ‌ర్లోనే ప్రారంభం అయ్యే అవ‌కాశం ఉంది. అంటే ఖ‌రీఫ్ సీజ‌న్ ఇంకాస్త ముందుకు తీసుకురావ‌డం, సేద్య గాళ్ల‌కు విత్త‌నాలు స‌కాలంలో అందించ‌డం, స‌బ్సిడీపై అవ‌స‌రం అయినంత మేర ఎరువులు అందించ‌డం వంటి ప‌నులు మ‌రింత వేగం చేసేందుకు కూడా యంత్రాంగం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఇప్ప‌టికే ఆదేశాలిచ్చారు జ‌గ‌న్.

రానున్న కాలంలో సేద్యాన్ని మ‌రింత లాభాల బాట ప‌ట్టించేందుకు ప్ర‌త్యామ్నాయ పంట‌ల రూపేణ వాణిజ్య పంట‌ల సాగుకు జ‌గ‌న్ మ‌రింత ప్రాధాన్యం ఇవ్వ‌నున్నారు. వీటిపై ఇప్ప‌టికే దృష్టి సారించాల‌ని వ్య‌వ‌సాయ అధికారుల‌ను ఆదేశించారు. కృత్రిమ ఎరువులు, పురుగు మందులు లేకుండా స‌హ‌జ సిద్ధ వ్య‌వ‌సాయం లేదా ప్ర‌కృతి వ్య‌వ‌సాయానికి ప్రాధాన్యం ఇస్తూ మూడు వేల 11 గ్రామాల్లో 6.95 ల‌క్ష‌ల మంది రైతుల‌ను ఆ దిశ‌గా ప్రోత్స‌హిస్తున్నారు. దీంతో ప్ర‌కృతి వ్య‌వ‌సాయ కార‌ణంగా ఆరోగ్య వంతం అయిన ఆహార ధాన్యాల ఉత్ప‌త్తి, పురుగుల మందుల ప్ర‌భావం లేని ఆహార ఉత్ప‌త్తి సాధ్యం కావ‌డం ఖాయం.

అదేవిధంగా పూర్వ ప‌ద్ధ‌తుల్లో సాగు చేయ‌డం ద్వారా నేల సారం పెర‌గ‌డం కూడా ఖాయం. ప‌శు ప‌క్షాదుల ఉనికి కాపాడ‌డం కూడా సాధ్యం అవుతుంది. త‌ద్వారా జీవావ‌ర‌ణ స‌మ‌తుల్యత (ఎకో బ్యాలెన్స్‌) సాధ్యం అవుతుంది. ఇదే స‌మ‌యంలో మ‌న రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప‌నుల‌ను నీతి అయోగ్ ( కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌) ప్ర‌శంసిస్తోంది. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ఈ ఖ‌రీఫ్ నుంచి గుడ్ ఎగ్రిక‌ల్చ‌ర్ ప్రాక్టీస్ కు ప్రాధాన్యం ఇస్తే, త‌ద్వారా మంచి ఫ‌లితాలు అందుకోవ‌డం ఖాయం అని సీఎం ఆశావ‌హ దృక్ప‌థంతో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news