ఏపీ కరోనా అప్డేట్ : 5145 కేసులు, 31 మరణాలు

-

ఏపీలో కొద్ది రోజులుగా కరోనా కేసులు కాస్త భారీగానే నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా కేసులు క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ కేసులు పెరిగాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4145 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 744864కి పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో మరో 31 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 6159కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 47665 యాక్టివ్‌ కరోనా కేసులు న్నాయి.

ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 691040కు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 70,521 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 64,20,474 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలానే తాజా కేసుల్లో అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 862 కేసులు నమోదు కాగా.. చిత్తూరులో 757, తూర్పు గోదావరిలో 738 కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news