వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తర్వాత నెంబర్ 2 ఎవరయ్యా అంటే… ముందు వెనక తడుముకోకుండా చెప్పే పేరు విజయసాయిరెడ్డి. వైసీపీలో ఎవరు చేరాలన్నా, ఎవరు ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా, జగన్ ను ముందుగా ఎవరైనా కలవాలనుకున్నా, విజయసాయిరెడ్డిని ప్రసన్ను చేసుకోవాల్సిందే. అంతగా ఆయన పార్టీలో జగన్ విజయసాయి రెడ్డి కి అత్యధికంగా ప్రాధాన్యం ఇవ్వడంతో ఆయన హవా ఆ విధంగా నడుస్తూ వస్తోంది. అయితే కొన్ని కొన్ని విషయాల్లో విజయసాయిరెడ్డి మాటను సైతం లెక్కచేయకుండా జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనకు ఇష్టం లేకపోయినా, తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని అంగీకరించవలసి వస్తుంది.ప్రస్తుతం విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాలకు పార్టీ ఇన్చార్జిగా ఉన్నారు. విశాఖ కేంద్రంగా ఆయన పార్టీ కార్యక్రమాల పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి, అక్కడ తన హవా చూపిస్తున్నారు.
ఎలాగూ పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించడంతో, విజయసాయి దృష్టి మొత్తం అక్కడే ఉంది. ఇక జగన్ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులను చేర్చుకుని వైసీపీకి తిరుగు లేకుండా చేయాలని, తెలుగుదేశం పార్టీని బలహీనం చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును వైసీపీలో చేర్చుకునేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, విజయసాయిరెడ్డి అడ్డుకోవడంతో అది వాయిదా పడుతూ వస్తోంది. అసలు 2019 ఎన్నికలకు ముందే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరాల్సి ఉన్నా, విజయసాయి రెడ్డి అడ్డుకోవడంతో అది వాయిదా పడుతూ వస్తోంది. టిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వైసీపీ లోకి వచ్చేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా, ఎప్పటికప్పుడు విజయసాయిరెడ్డి అడ్డుకుంటూనే వస్తుండడంతో గంటా సైతం నిరాశలో ఉండిపోయారు.
ఇక పార్టీలో మరో కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి గంటా చెరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, జగన్ పై ఒత్తిడి చేయడంతో దాదాపు ఆయన చేరిక ఖాయమైపోయింది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తవడంతో విజయసాయిరెడ్డి కాస్త అలక చెందినట్టు గా పార్టీలో ప్రచారం జరుగుతోంది . అయితే జగన్ ఆయనను ఎందుకు నేర్చుకోవాల్సి వస్తుందో సూటిగా చెప్పేయడంతో, విజయసాయిరెడ్డి తప్పనిసరి పరిస్థితుల్లో గంటా చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అది కాకుండా, తాను వైసీపీ లోకి రాకుండా అడుగడుగునా అడ్డుకుంటూ వస్తున్న విజయసాయిరెడ్డిని ప్రసన్నం చేసుకునే పనిలో గంటా సక్సెస్ అవడంతో, ఇక రేపో మాపో గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజను పార్టీ లో చేర్పించి అనధికారికంగా వైసీపీలో గంటా చేరే అవకాశం కనిపిస్తోంది.
-Surya