అయోధ్య రామమందిర నిర్మాణానికి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ 10 వేల రూపాయల విరాళం ఇచ్చారు. డిజిపి కార్యాలయంలో తనను కలిసిన బిజెపి నేత రఘుకు 10 వేల విరాళం అందించారు ఏపీ డీజీపీ. రఘుతో పాటు పలువురు ఆర్ ఎస్ ఎస్ నేతలు కూడా డీజీపీని కలిశారు. అయితే డీజీపీ క్రిస్టియన్ అంటూ పలువురు నేతలు ఆరోపిస్తున్న నేపధ్యంలో డీజీపీ విరాళం ఇవ్వడం సంచలనంగా మారింది. ఇక ఈ ఉదయం డీజీపీ కార్యాలయానికి పెద్ద ఎత్తున బీజేపీ నేతలు వెళ్లారు.
విగ్రహాల ద్వంసం కేసులో డీజీపీ బీజేపీ కి చెందినవారు ఉన్నారని డిజిపి చేసిన వ్యాఖ్యలు ఖండించిన సోము వీర్రాజు 20వ తేదీ లోగా వ్యాఖ్యలు ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పకుంటే… న్యాయ పోరాటం చేస్తామన్న బిజెపి నేతలు, ఈరోజు తో గడువు ముగిస్తుండడంతో బీజేపీ నేతల కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది. ఇక బీజేపీ చేపట్టనున్న రథయాత్ర కు అనుమతి జోసం దరఖాస్తు చేసేందుకు నేతలు డీజీపీ ఆఫీస్ కి వెళ్ళారని అంటున్నారు.