సీఎం జగన్ కు ఉద్యోగుల షాక్.. పీఆర్సీపై రాజీపడే సమస్య లేదని హెచ్చరిక !

ఏపీ సీఎంవో అధికారులతో ఉద్యోగ సంఘాల నేతల సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఏపీ జేఎసీ, ఏపీ జేఏసీ అమరావతి సంఘాల నేతలు పాల్గొన్నారు. సీఎంవో అధికారులతో గంటన్నర పాటు కొనసాగింది ఉద్యోగ సంఘాల నేతల సమావేశం. ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ.. 7 న 11 పీఆర్సీ పై సీఎం జగన్ ప్రకటన చేశారని.. హెచ్ఆర్ఏ, సీసీఎ, పెన్షనర్లకు అదనపు ప్రయోజనాలపై ఉన్నతాధికారులతో చర్చించాలని అప్పుడు సీఎం సూచించారన్నారు.

హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చి పని చేస్తున్న ఉద్యోగులకు 30 శాతం హెచ్ఆర్ఏ ఇస్తున్నారని.. జిల్లాలు, మున్సిపాల్టీలు, మండలాల్లో పనిచేసే వారికి వేర్వేరు కేటగిరిల్లో హెచ్ఆర్ఎ ఇస్తున్నారని పేర్కొన్నారు. సీఎస్ కమిటీ సిఫార్సులు కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకున్నట్లు ఉన్నాయని.. సంక్రాంతి పండుగ తర్వాత సీఎంతో మాట్లాడి స్పష్టత ఇస్తాం అన్నారని వెల్లడించారు.

అప్పటి వరకు జీవోలను అభయెన్స్ లో పెడతామని చెప్పారు.. మాతో మరోసారి మాట్లాడి ఆ తర్వాతే జీవోలు విడుదల చేస్తాం అన్నారని పేర్కొన్నారు. మాకు ముఖ్యమంత్రి పై నమ్మకం ఉంది.. సీఎస్ కమిటీ సిఫార్సులనే అమలు చేస్తామంటే ఆందోళన కార్యక్రమాలు చేపట్టక తప్పనిసరి అవుతుందని చెప్పారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాజీపడబోమని..హెచ్చరించారు.