Breaking : మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కరోనా

-

కరోనా మహమ్మారి మరోసరి విజృంభిస్తోంది. రోజు రోజుకు దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుతున్నాయి. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్‌ మళ్లీ పుంజుకుంటుంది. కరోనా పుట్టినిల్లు చైనాలో కూడా ఇటీవల కరోనా బీభత్సం సృష్టించింది. కరోనా దెబ్బకు చైనాలో ని శాంఘై సిటీలో కఠినమైన లాక్‌డౌన్‌ నిబంధనలు విధించారు. దీంతో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే.. ఏపీ మాజీ మంత్రి, విశాఖ జిల్లా భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో ప్ర‌స్తుతం ఆయన త‌న ఇంటిలోనే ఐసోలేష‌న్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అవంతి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉందని వైద్యులు వెల్లడించారు.

2019 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన అవంతి వైసీపీ టికెట్‌పై భీమిలి నుంచి పోటీకి దిగి విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన వైసీపీ ఏపీలో కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డంతో జ‌గ‌న్ తొలి కేబినెట్‌లో ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా అవంతికి అవ‌కాశం దక్కింది. ఇటీవ‌లే జ‌రిగిన మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో అవంతి మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. ఇదిలా ఉంటే.. కరోనా ఫోర్త్‌ వేవ్‌ వచ్చినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడించాయి

 

Read more RELATED
Recommended to you

Exit mobile version