Breaking : వైద్య ఆరోగ్యశాఖకు జాతీయ గుర్తింపు.. విడ‌ద‌ల ర‌జినిని అభినందించిన జగన్‌

-

ఆరోగ్య రంగంపై రాష్ట్ర ప్ర‌భుత్వాల స‌ద‌స్సులో మంత్రి విడ‌ద‌ల ర‌జిని పాల్గొన్నారు. ఏపీలో నిర్వహిస్తోన్న టెలీ క‌న్స‌ల్టేష‌న్ అంశంలో అవార్డు లభించింది. అయితే.. ఏపీ వైద్యఆరోగ్య విభాగం జాతీయస్థాయిలో రెండు అవార్డులు కైవసం చేసుకుంది. టెలీ కన్సల్టేషన్ విభాగంలోనూ, విలేజ్ హెల్త్ క్లినిక్ ల అంశంలోనూ ఏపీకి ఈ అవార్డులు దక్కాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు కేంద్రమంత్రి డాక్టర్ మన్సుక్ మాండవీయ చేతల మీదుగా ఈ అవార్డులు అందుకున్నారు. ఈ నేపథ్యంలో, మంత్రి విడదల రజని, ఎం.టి.కృష్ణబాబు నేడు తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిశారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖకు లభించిన అవార్డులను ఆయనకు చూపించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మంత్రి విడదల రజని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబులను, ఇతర వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అభినందించారు.

మున్ముందు కూడా ఇదే తరహా పనితీరు కనబర్చాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వైద్య రంగం ఎంతో పురోగతి సాధించినట్లు మంత్రి విడదల రజిని చెప్పారు. రూ.16వేల కోట్ల‌ రుపాయల వ్యయంతో వైద్య ఆరోగ్య రంగాన్ని బ‌లోపేతం చేస్తున్నామన్నారు. ఆరోగ్య ఆస‌రా లాంటి ప‌థ‌కాల‌తో చ‌రిత్ర సృష్టించామని, ఆరోగ్యశ్రీ పథకం అమలుతో నిజ‌మైన హెల్త్ క‌వ‌రేజి డేను సాధించామని వివరించారు రజిని.

Read more RELATED
Recommended to you

Exit mobile version