ఉన్నత విద్యా రంగంలో ఏపీ సర్కార్ కీలక సంస్కరణలు తీసుకురానుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–2020 మీద సీఎం వైయస్ జగన్ నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని కాలేజీలు మూడేళ్లలో పూర్తి ప్రమాణాలు సాధించాలని, తప్పని సరిగా ఎన్‌ఏసీ, ఎన్‌బీఏ అక్రిడిటేషన్ పొందాలని పేర్కొన్నారు. ప్రభుత్వ కాలేజీలు కూడా ఆ ప్రమాణాలు సాధించాలని, జగన్ స్పష్టం చేశారు. కాలేజీల్లో ప్రమాణాలపై ఎస్‌ఓపీలు ఖరారు చేయమని ఆదేశించిన ఆయన అన్ని కాలేజీలలో రెగ్యులర్‌గా తనిఖీలు చేయమని అన్నారు.
అందుకు 30 మందితో 10 బృందాలు ఏర్పాటు చేయమని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా టీచర్ ట్రెయినింగ్ కాలేజీలపై దృష్టి పెట్టమని జగన్ కోరారు. వాటిలో ప్రమాణాలు లేకపోతే నోటీసులు ఇవ్వమని జగన్ ఆదేశించారు. మార్పు రాకపోతే ఆ కాలేజీలను మూసి వేయండని అన్నారు. ఉన్నత విద్యలో అడ్వాన్స్‌డ్ టాపిక్స్‌తో కోర్సులు పెట్టాలన్న ఆయన ఇక నుంచి ఏడాది లేక రెండేళ్ల పీజీ ప్రోగ్రాములు ప్రవేశ పెట్టమని ఆదేశించారు. మూడు లేక నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రాములు ఉండేలా డిజైన్ చేయాలనీ కోరారు. నాలుగేళ్ల డిగ్రీ చేసిన వారికి పీహెచ్‌డీలో నేరుగా అడ్మిషన్లు ఇచ్చేలా చూడాలని ఆదేశించాలి. రాష్ట్రంలో అటానమస్ కాలేజీల సంఖ్య పెరగాలన్న జగన్ ఆకాంక్షించారు.