ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల సంక్రాంతి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజా గా సంక్రాంతి సెలవుల్లో కాస్త మార్పులు చేస్తు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగ గతంలో సంక్రాంతి సెలవులను ఈ నెల 14, 15, 16 తేదీలలో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ తాజాగా ఈ తేదీలను మారుస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 13, 14, 15 తేదీలలో సంక్రాంతి సెలువులు ఉంటాయని తెలిపింది. ఈ తేదీలలోనే భోగీ, సంక్రాంతి, కనుమ పండుగులు ఉంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ అమలులో కూడా కొంత వరకు మార్పులు చేసింది. ఈ మార్పులతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి నైట్ కర్ఫ్యూ అమలు కానుంది. ఈ నైట్ కర్ఫ్యూలో కేవలం అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు ఉండనుంది.