ఆర్థిక ఇబ్బందులున్నాయి.. జీతాలు పెంచలేం : ఏపీ సర్కార్

-

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేదని.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. అందువల్లే వేతనాలు పెంచడం కుదరదని ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు స్పష్టం చేసింది. వెలుగు పరిధిలో పనిచేస్తున్న మండల సమాఖ్య క్లస్టర్‌ కోఆర్డినేటర్ల (ఎంఎస్‌సీసీ) ఆశలపై నీళ్లు చల్లింది. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా వేతనాలు పెంచలేమని క్లారిటీ ఇచ్చింది.

ఎఫ్‌టీఈ హెచ్‌ఆర్‌ పాలసీలోకి తీసుకురావడమూ కుదరదని సర్కార్ తేల్చిచెప్పింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ ఈ నెల 4న మెమో జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్‌సీసీలు 1100 మంది వరకు ఉన్నారు. దీనిపై సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌ వివరణ కోరగా.. సంబంధిత దస్త్రం తమకు ఇంకా చేరలేదని అన్నారు.

ప్రభుత్వ ప్రకటన వెలుగు ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. ఎంతో కాలంగా వేతనం పెరుగుతుందని ఎదురుచూసిన వారికి చివరకు నిరాశే ఎదురైంది. మరోవైపు ఎంఎస్‌సీసీలు, అకౌంటెంట్లకు వేతనాలు పెంచుతామని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలుచేయిస్తామని వెలుగు, వైకేపీలో పనిచేస్తున్న కొంతమంది నుంచి పంచాయతీరాజ్‌శాఖ పరిధిలోని ఓ అధికారి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news