ఈ స్కీమ్ తో కోటీశ్వరులు అవ్వచ్చు.. వడ్డీతోనే రూ.కోటికి పైగా లాభం..!

-

ధనవంతులు అవ్వాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కోటీశ్వరులు అవ్వాలని కోట్ల రూపాయలని వెనకేయాలని అంతా అనుకుంటూ వుంటారు. మీరు కూడా కోటీశ్వరులు అవ్వాలని అనుకుంటున్నారా..? అయితే ఈ స్కీమ్ గురించి చూడాల్సిందే. ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్స్ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా చాలా మందికి ప్రయోజనం కలుగుతోంది. దీర్ఘకాలం పొదుపు చేస్తే పెద్ద మొత్తంలో రాబడి వస్తుంది. పైగా రిస్క్ ఏమి ఉండదు. పెట్టుబడి పూర్తిగా సురక్షితం. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను 18 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులు ఎవరైనా సరే ఓపెన్ చేసేయచ్చు.

ఈ అకౌంట్ ని ఓపెన్ చేసేందుకు గరిష్ట వయో పరిమితి ఏమి లేదు. ఎవరైనా సరే ఈ అకౌంట్ ని ఓపెన్ చేసేయచ్చు. ఇందులో మీరు ఏడాదికి రూ. 500 అయినా సరే ఇన్వెస్ట్ చేసేయచ్చు. గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకూ మీరు ఈ స్కీమ్ లో పెట్టచ్చు. ఈ పథకం లాక్ ఇన్ ఫైరియడ్ వచ్చేసి 15 ఏళ్లు. 7.10 శాతం వార్షిక వడ్డీని ప్రభుత్వం ఇస్తోంది. మూడు నెలలకోసారి ఈ వడ్డీ రేటు మారుతుంది. మెచ్యూరిటీ కాలవ్యవధి పదిహేనేళ్ళు అయ్యాక మరో ఐదేళ్లు మీరు ఎక్స్టెండ్ చేసేయచ్చు.

రోజుకు రూ. 417 లేదా నెలకు రూ.12,500 చొప్పున 15 ఏళ్ల పాటు పొదుపు చేస్తే మీకు మెచ్యూరిటీపై రూ.40.68 లక్షలు వస్తాయో. ఇంకో ఐదేళ్లు దీన్ని పెంచుకుంటూ వెళ్ళచ్చు. అప్పుడు రూ. 1.03 కోట్లు అవుతుంది. మీ మొత్తం పెట్టుబడి రూ. 37.50 లక్షలు అవ్వగా వడ్డీ రూపంలో రూ. 65.58 లక్షలు వస్తాయి. 30 సంవత్సరాల వయస్సులో ఈ స్కీమ్ లో డబ్బులని పెడితే 55 వచ్చే సరికి కోటి రూపాయలు వస్తాయి. సెక్షన్ 80సి కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news