అంబేడ్కర్ 125వ జయంత్యుత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 14న హైదరాబాద్‌లో 125 అడుగుల విగ్రహాన్ని తెలంగాణ సర్కార్ ఆవిష్కరించనుంది. హుస్సేన్‌సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్‌ను ఆనుకుని దాదాపు 11.80 ఎకరాల స్థలంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహం ఠీవిగా రేపటి నుంచి దర్శనమివ్వబోతోంది. విగ్రహావిష్కరణ తరువాత హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపిస్తారు. రేపు ఆవిష్కరణ కానున్న అంబేడ్కర్ విగ్రహ ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా..?
బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహం ప్రత్యేకతలు..
అంబేడ్కర్ స్మారక ప్రాంగణ విస్తీర్ణం.. 11.80 ఎకరాలు
పీఠం నిర్మాణం, విగ్రహం ఏర్పాటు విస్తీర్ణం.. రెండు ఎకరాలు
విగ్రహ స్తూపం(పీఠం) ఎత్తు .. 50 అడుగులు
విగ్రహం వెడల్పు.. 45 అడుగులు
పీఠం వెడల్పు.. 172 అడుగులు
విగ్రహం బరువు.. 435 టన్నులు
విగ్రహం తయారీకి వినియోగించిన ఉక్కు.. 791 టన్నులు
విగ్రహం తయారీకి వినియోగించిన ఇత్తడి.. 96 మెట్రిక్ టన్నులు
విగ్రహం తయారీకి రోజూ పని చేసిన కార్మికులు.. 425 మంది
దేశంలోనే అతి ఎత్తయిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ప్రముఖ శిల్పి రామ్ వి సుతార్ రూపొందించారు.