ఏపీ ఎంసెట్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజు కట్టేందుకు అలానే సర్టిఫికేట్ ల పరిశీలనకు గడువు నవంబర్ 3 దాకా పొడిగించింది. నిజానికి ఏపీలో అక్టోబర్ 23 నుంచి ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగానికి వెబ్ కౌన్సిలింగ్ ప్రారంభం అయింది. ఆన్‌లైన్ లోనే ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఏర్పాట్లు చేశారు.
ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 25 హెల్ప్‌లైన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. అలానే రిజిస్టర్ కాని అభ్యర్థులను వెబ్ ఆప్షన్ల ఎంట్రీ సమయంలోనూ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించేందుకు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అనుమతిస్తామని ఎంసెట్ అధికారులు పేర్కొన్నారు. అలానే ఆప్షన్ల ఎంట్రీపై సూచనలు, ఇతర వివరాల కోసం https://apeamcet.nic.in వెబ్‌సైట్ లో కాంటాక్ట్ కావచ్చని అభ్యర్థులకు సూచించారు.