స్థానిక ఎన్నికలు… అర్ధరాత్రి కోర్టుకెక్కన ఏపీ ప్రభుత్వం

-

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈరోజు రాజకీయ పార్టీలతో నిర్వహించాలని భావించిన ఆల్ పార్టీ మీటింగ్ జరగకుండా స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు మంగళవారం రాత్రి హై కోర్టు లో అత్యవసరంగా హౌజ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది.

సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా రాజకీయ పార్టీ లతో సమావేశం నిర్వహిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తన పిటీషన్ లో పేర్కొంది. సుప్రీం కోర్టు ఆదేశాలకు భిన్నంగా జరుగుతున్నందున రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈరోజు నిర్వహిస్తున్న సమావేశాన్ని నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తన పిటీషన్ లో హై కోర్టు ను అభ్యర్థించింది. అయితే ముందు గానే ఈ మీటింగ్ కు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news