రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో.. ఏం జరుగుతాయో చెప్పడం కష్టం. నిన్న మొన్నటి వరకు వెలుగు వెలిగిన నాయకులు కూడా నేటి పరిస్థితులకు అనుగుణంగా దూకుడు పెంచక పోతే.. ఏం జరుగుతుందో ఏపీ రాజకీయాలు చెబుతూనే ఉన్నాయి. వివాద రహితులుగా ఉండడమే.. ఒకప్పుడు నేతలకు అర్హత కావొచ్చు. కానీ, నేడు అలా కుదరదు.. వివాద రహితులుగా ఉన్నారా లేదా? అనే దానికంటే కూడా ఫైర్ బ్రాండ్లా కాదా..? అనేదే ప్రధానం. నేటి పరిస్థితిలో ఇలాంటి నేతలకే రాజకీయాల్లో ప్రాధాన్యం దక్కుతున్న మాట వాస్తవం.
అయితే, నాటి తరం నేతలు చాలా మంది ఈ దూకుడును అందిపుచ్చుకోలేక పోతున్నారు. దీంతో వారు రాజకీయాలకు దూరమవుతున్నారు. ఇలాంటివారిలో చాలా మంది నాయకులు ఉన్నారు. వీరిలో నిన్న మొన్నటి వరకు ఒకింత లైవ్లో ఉండి.. ఇటీవల కాలంలో రాజకీయంగా ప్రాభవం కోల్పోతున్న నేతగా పేరు పడుతున్న మండలి బుద్ధ ప్రసాద్ ప్రధానంగా చర్చకు వస్తున్నారు. కాంగ్రెస్లో సుదీర్ఘ కాలం ఉన్న మండలి వెంకట కృష్ణారావు వారసుడిగా పార్టీలో కి వచ్చిన బుద్ద ప్రసాద్ తన తండ్రి పేరు నిలబెట్టేలా వ్యవహరించారనడంలో ఎలాంటి సందేహం లేదు ఇన్నేళ్ల పొలిటికల్ సర్వీసులో ఒక్క మరక కూడా లేదు.
ఇక, రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలోకి రావడం అవనిగడ్డ నియోజకవర్గం నుంచి విజయం సాధించడం ఆ వెంటనే డిప్యూటీ స్పీకర్గా పదవి అందుకోవడం జరిగిపోయాయి. అయితే, రాజకీయాల్లోకి మూడో తరం వారసుడిగా తన కుమారుడు మండలి వెంకట్రామ్ను ప్రవేశ పెట్టాలని భావించినప్పటికీ.. అది సాధ్యం కావడం లేదు.గత ఎన్నికల్లోనే టీడీపీ తరఫున తన కుమారుడిని నిలబెట్టుకోవాలని అనుకున్నారు. అయితే, చంద్రబాబు ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో తనే పోటీకి దిగినా.. జగన్ సునామీతో ఆయన ఓడిపోయారు.
ఇక, అప్పటి నుంచి ఆయన టీడీపీకి దాదాపు దూరంగానే ఉన్నారు. చంద్రబాబు పార్టీ తరఫున వైసీపీ సర్కారుపై యుద్ధం ప్రకటించినా.. ఏ కార్యక్రమానికీ మండలి హాజరుకాలేదు. పోనీ.. తనకుమారుడినైనా రంగంలోకిదింపారా? అంటే.. అది కూడాలేదు. పోనీ.. ఆయననైనా మేధావిగా టీవీ చర్చల్లో పాల్గొని టీడీపీ వాయిస్ వినిపించాలని చంద్రబాబు పదేపదే విజ్ఞప్తి చేశారు. అయినా మండలి ముందుకు రాలేదు. దీంతో చంద్రబాబు ఆయనను పక్కన పెట్టారని కొంతకాలంగా వార్తలు వచ్చాయి.
ఇక, ఇటీవల ప్రకటించిన పార్టీపదవుల్లో చంద్రబాబు ఆయనకు ఎక్కడా చోటు ఇవ్వలేదు. పొలిట్ బ్యూరోలోఅయినా మండలికి చోటు ఇస్తారని అనుకున్నా.. అది కూడా దక్కలేదు. ఈ పరిణామంతో మండలితీవ్రమానసిక వేదనలో కూరుకుపోయారని అంటున్నారు. ముఖ్యంగా వారసుడివిషయంలో ఆయన దూకుడు చూపలేక పోయారనేది కీలక విషయంగా చర్చకువస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.