ఏపీ సర్కార్ నిర్ణయం.. సెప్టెంబర్‌ 17 నుంచి ఎంసెట్‌ పరీక్ష..!

-

ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌) తేదీలకు సంబంధించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం ప్రకటించారు. దీని ప్రకారం రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ పరీక్షను సెప్టెంబర్‌ 17 నుంచి 25 వరకూ నిర్వహించనున్నారు. మరోవైపు సెప్టెంబర్‌ 10,11 తేదీల్లో ఐసెట్‌, 14న ఈసెట్‌, 28,29,30 తేదీల్లో ఏపీ పీఈసెట్‌, అక్టోబర్‌ 1న ఎడ్‌సెట్‌, 2వ తేదీన లాసెట్‌ నిర్వహించనుంది. ఇకపోతే తెలంగాణలో ఈ నెల 31న ఈసెట్, వచ్చే నెల 2న పాలిసెట్, వచ్చే నెల 9, 10, 11, 14 తేదీల్లో ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

కాగా, కోవిడ్‌-19 కార‌ణంగా ప్ర‌వేశ ప‌రీక్ష‌లు వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. ఇప్పటికే ఏపీ లో 2020-21 విద్యా సంవత్సరం ఖరారు కావడంతో తో పాఠశాలలను సెప్టెంబర్ 5 న ప్రారంభిస్తాం అని మంత్రి ఆదిములపు సురేష్ అన్నారు. అలాగే అదే రోజు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందజేస్తాం అని ఇప్పటికే తెలిపిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version