రేసింగ్ ఈవెంట్ క్యాలెండర్ ను విడుదల ఏపీ సర్కార్.. డిసెంబర్‌ లో రేసింగ్‌ !

-

విశాఖ : రేసింగ్ ఈవెంట్ క్యాలెండర్ ను విడుదల చేశారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాసరావు మట్లాడుతూ.. డిసెంబర్ లో మోటార్ స్పోర్ట్స్, కార్ రేసింగ్ విశాఖ లో జరగబోతోందని తెలిపారు. విశాఖ లో జరపడం చాలా మంచి విషయమని తెలిపారు. భద్రత మొత్తం చూసి పెర్మిషన్ ఇస్తామని వెల్లడించారు మంత్రి అవంతి. ఇలాంటి ఈవెంట్స్ వలన విశాఖ పేరు పెరుగుతుందన్నారు.

ఇలాంటి వాటి వలన ప్రతి ఒక్కరూ రోడ్డు సేఫ్టీ గురించి నేర్చుకోవచ్చన్నారు. రోడ్డు ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని… ఏషియా స్థాయి లో ఈ కార్ రేసింగ్ జరుగుతుందని తెలిపారు మంత్రి అవంతి శ్రీనివాస్‌. ఎటువంటి లోపాలు లేకుండా జరగాలి అని ప్రమోటర్స్ ను కోరుకుంటున్నామని చెప్పారు. మోటార్ స్పోర్ట్స్, కార్ రేసింగ్ విశాఖ లో జరుగడం చాలా గొప్ప విషయమని… ఇలాంటి టోర్నీలు జరుగుతే… విశాఖ పేరు దేశంలోనే మారుమోగ్రుతుందన్నారు మంత్రి అవంతి.

Read more RELATED
Recommended to you

Latest news