కోటక్​ మహీంద్రా బ్యాంక్ కొత్త రూల్స్.. వివరాలివే..!

-

కోటక్​ మహీంద్రా బ్యాంక్​ గృహ రుణ గ్రహీతలకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. దసరా, దీపావళి పండుగ సమయంలో ప్రైవేట్​రంగ బ్యాంకింగ్​ దిగ్గజం కోటక్​ మహీంద్రా బ్యాంక్​ మార్కెట్​లోనే అతి తక్కువ వడ్డీకే గృహరుణాలు ఆఫర్​ చేసింది. అయితే పండుగ సీజన్ అయ్యాక వడ్డీ రేట్లు పెంచింది.

 

kotak mahindra bank

బ్యాంకు గృహ రుణ వడ్డీ రేట్లు 5 బేసిస్​ పాయింట్లు అంటే 0.05 శాతం మేర పెంచింది. దీనితో గృహ రుణ వడ్డీ రేట్లు 6.55 శాతం నుంచి స్టార్ట్ అవ్వనున్నాయి. నవంబర్ 9 నుంచి డిసెంబర్ 10 వరకు ఈ కొత్త వడ్డీరేట్లు వుంటాయని కోటక్​ మహీంద్రా బ్యాంక్ అంది. పండుగ సందర్భంగా 6.5 శాతం వడ్డీకే కోటక్ మహీంద్రా గృహరుణాలను దాదాపు 60 రోజుల పాటు ఇచ్చింది.

అయితే నవంబర్​ 8తో ఈ ఆఫర్​ ముగిసింది. నవంబర్​ 9 నుంచి డిసెంబర్​ 10 వరకు కొత్త వడ్డీ రేట్లు వచ్చాయి. నవంబర్ 15లోపు లోన్​ అమౌంట్​ ట్రాన్స్​ఫర్​ అయితే పాత వడ్డీ రేటు 6.5 శాతం అమల్లో ఉంటుంది. ఇది ఇలా ఉంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ కొత్త వడ్డీ రేటు బ్యాలెన్స్​ ట్రాన్స్​ఫర్​ రుణాల పై ఇది వర్తిస్తుంది. అలానే ఈ వడ్డీరేటు కింద ప్రిన్సిపల్​ అమౌంట్​పై ఎటువంటి లిమిట్ లేదు. గృహరుణాలు నెలవారీ జీతం పొందే ఉద్యోగులు మరియు స్వయం ఉపాధి పొందే నిపుణులకు ఈ లోన్ అందుబాటులో ఉంటుంది. 6.5 శాతం వడ్డీ అనేది కనీస వడ్డీ రేటు. సిబిల్ స్కోర్ ఆధారంగా గరిష్ట వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news