ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం లోటు బడ్జెట్ లో ఉంది. ఒకటో తారీఖు వచ్చిందంటే జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆదాయాన్ని పెంచుకునే దిశగా ఏపీ సర్కార్ కసరత్తు మొదలు పెట్టింది. అందులో భాగంగానే రవాణ శాఖలో పన్నులు పెంచాలని ప్రతిపాదనలు సిద్దం చేసి సీఎంకు పంపగా, దానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
దీని మీద ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం కనిపిస్తోంది. పన్నుల పెంపు ద్వారా రవాణ శాఖ నుంచి అదనంగా సుమారు రూ. 400 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. టూ వీలర్, ఫోర్ వీలర్ల లైఫ్ ట్యాక్స్ పెంచుతూ ప్రతిపాదనలను రవాణ శాఖ రూపొందించింది. రెండు రకాల శ్లాబుల్లో ప్రస్తుతం ఉన్న పన్ను మీద 1-3 శాతం మేర పెంపు ఉండనుంది. ప్రస్తుతం 9, 12 శాతంగా ఉన్న టూ వీలర్, ఫోర్ వీలర్ లైఫ్ ట్యాక్స్ ని కొంత మేర పెంచనున్నారు. 2010 తర్వాత టూ, ఫోర్ వీలర్లకు లైఫ్ ట్యాక్సు పెంచలేదు.