అమరావతి అనుబంధ పిటిషన్ ల మీద విచారణ జరిపిన ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇంప్లీడ్ అవుతామని వేసిన అన్ని పిటిషన్ లని హైకోర్టు కొట్టేసింది. అలానే విశాఖ గెస్ట్ హౌస్ కి సంబంధించి ప్లాన్ కోర్టులో దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణం పరిపాలన రాజధానిలో భాగంగా నిర్మిస్తే గనుక అప్పుడు పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకురావచ్చని అప్పుడు వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.
స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణాలు ప్రారంభించడానికి కాపులుప్పాడ కొండపై 30 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం గతంలో జీవోను విడుదల చేసింది. స్థలం కేటాయింపునకు అవసరమైన రికార్డుల రూపకల్పనను అత్యవసర వ్యవహారంగా పరిగణించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్థలం కేటాయింపు, ఇతర అంశాల్లో త్వరితగతిన ముందుకు వెళ్లాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.