కరోనాపై ఏపీ హైకోర్ట్ కీలక ఆదేశాలు…!

-

ఆంధ్రా తెలంగాణా సరిహద్దుల్లో ఉన్న వారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. బిజెపి నేత వెలగపూడి గోపాల కృష్ణ కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన హైకోర్ట్… ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చేవారిపై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచింది. తెలంగాణ, ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చేవారిపై రాష్ట్ర హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ ఇచ్చిన ఎన్‌వోసీని ఎంట్రీ పాయింట్‌లోనే పరిశీలించాలని సూచించింది. ఆరోగ్యపరంగా బాగుంటేనే అనుమతించాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఆరోగ్యంగా లేకపోతే క్వారంటైన్‌కు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచనలు చేసింది. క్వారంటైన్‌ అవసరం లేకపోతే గృహనిర్బంధంలో ఉంచి ఎప్పటికప్పుడు డాక్టర్లను పర్యవేక్షించేలా చూడాలని సర్కార్‌కు హైకోర్టు సూచించింది. .

ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి హైదరాబాద్ లో ఉన్న ఉద్యోగులు, విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుడటం, మరోవైపు రాష్ట్ర సరిహద్దుల్లో నిలిచిపోతుండటంతో బీజేపీ నేత వెలగపూడి గోపాలకృష్ణ హైకోర్టు పిటిషన్‌ వేశారు. దీనిపై శుక్రవారం నాడు హైకోర్టు విచారించి ఈ ఆదేశాలు ఇచ్చింది. రెండు రోజులుగా ఆంధ్రా తెలంగాణా సరిహద్దుల్లో వందల మంది ఏపీ లోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version