ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీ శ్మశాన వాటికల్లో ఇళ్ల నిర్మాణాల అంశంపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. శ్మశాన వాటికల్లో ఇళ్ల నిర్మాణంపై ఉన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్సీ వైకుంఠ ధామాల్లో ఆర్బీకేలు, జగనన్న ఇండ్ల నిర్మాణాలు చేపట్టొద్దంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఇళ్లను కేటాయిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కపిలేశ్వరం వాసి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. శ్మశాన వాటికల్లో ఇళ్ల నిర్మాణం దారుణమని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. న్యాయవాది శ్రవణ్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. ఎస్సీ శ్మశాన వాటికల్లో ఆర్బీకేలు, జగనన్న ఇళ్ల నిర్మాణాలు చేపట్టవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.