తెలంగాణలో బీజేపీ వేగంగా పుంజుకుంటుంది…ఇందులో ఎలాంటి డౌట్ లేదు…నెక్స్ట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీతో ఢీ అంటే ఢీ అనేలా బీజేపీ ఫైట్ చేయనుంది. ఇంకా కొంచెం గట్టిగా కష్టపడితే బీజేపీ అధికారం దక్కించుకోవచ్చు. ఇక్కడ బీజేపీ-టీఆర్ఎస్ పార్టీల మధ్య జరిగే పోరు గురించి పక్కన పెడితే…అసలు నెక్స్ట్ బీజేపీ గాని అధికారంలోకి వస్తే సీఎం అయ్యేది ఎవరు.? అంటే అది బీజేపీ అధిష్టానం చేతుల్లో ఉందని చెప్పొచ్చు.
సీఎం అభ్యర్ధి అనేది బీజేపీ అధిష్టానం చేతుల్లో ఉంది..కానీ బీజేపీని గెలిపించడానికి సెంటరాఫ్ ఎట్రాక్షన్ గల నాయకుడు కావాలి. ఉదాహరణకు టీఆర్ఎస్ మొత్తం కేసీఆర్‌పైనే ఆధారపడి ఉంది. ఆయనని చూసి టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తారు. ఇటు కాంగ్రెస్‌లో చాలామంది నేతలు పోటీలో ఉన్నారు గాని…మెయిన్ గా మాత్రం రేవంత్ రెడ్డి సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా ఉంటారు. మరి బీజేపీలో అలా ఉండే నేత ఎవరు.
ప్రస్తుతానికి బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, వివేక్ లాంటి నేతలకు రాష్ట్ర స్థాయిలో ఫాలోయింగ్ ఉంది…మరి వీరిలో ఎవరు మెయిన్‌గా ఉంటారంటే చెప్పలేని పరిస్తితి. ఎవరిని చూసి ప్రజలు ఓట్లు వేస్తారంటే..కొన్ని నియోజకవర్గాల్లో బండి సంజయ్ బట్టి, కొన్ని చోట్ల ఈటల బట్టి…అలాగే గ్రేటర్ లాంటి స్థానాల్లో కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌ల ప్రభావం ఉంటుంది…ఎస్సీ , ఎస్టీ స్థానాల్లో వివేక్ ప్రభావం ఉంటుంది.
ఓవరాల్‌గా చూస్తే ఒక నాయకుడు చుట్టూ బీజేపీ తిరగదని తెలుస్తోంది…కానీ తెలంగాణలో బీజేపీకి ఒక బ్రహ్మాస్త్రం ఉందని, ఆ అస్త్రమే మోదీ ఇమేజ్ అని లక్ష్మణ్ అంటున్నారు. ఆయన పేరుతోనే తాము ఎన్నికల బరిలో దిగుతామని, ప్రజలు మోదీని బట్టే ఓట్లు వేస్తారని చెబుతున్నారు. ఇక ముందుగానే నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించనున్నామని, సీఎం ఎవరనేది అధిష్ఠానం తేలుస్తుందని, మోదీయే బ్రహ్మాస్త్రంగా ఎన్నికలకు వెళ్తామని అంటున్నారు. మరి ఈ బ్రహ్మాస్త్రం బీజేపీకి ఎంత ప్లస్ అవుతుందో చూడాలి.