జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏపీ హై కోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. డిగ్రీ కళాశాలల్లో యాజమాన్య కోటా పై ఇవాళ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. యాజమాన్య కోటా లో 30 శాతం సీట్ల భర్తీ కి కన్వీనర్ నోటిఫికేషన్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిబందనను కొట్టి వేసింది హై కోర్టు ధర్మాసనం. యాజమాన్య కోటా లో సీట్ల భర్తీని కన్వీనర్ చేస్తారనే నిబంధనను కూడా కొట్టి వేసింది ఏపీ ధర్మాసనం.
యాజమాన్య కోటాలో సీటు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటి, ఓబీసీలకు కూడా జగన్నన్న విద్యాదీవెన వర్తింపచేయాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం విదించే నిబంధనలు సమంజసం కాదని స్పష్టం చేసింది హైకోర్టు. యాజమాన్య కోటాను కూడా కన్వీనర్ భర్తీ చేస్తారని ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలపై హైకోర్టును ఆశ్రయించింది రాయలసీమ డిగ్రీ కళాశాలల యాజమాన్యం. యాజమాన్యం తరపున ముతుకుమల్లి శ్రీవిజయ్, వేదుల వెంకటరమణ, వీరారెడ్డి వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే తన తీర్పును వెలువరించింది హై కోర్టు.