OMICRON TENSION : విదేశాల నుంచి ఏపీకి వచ్చిన 30 మంది మిస్సింగ్ !

-

విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 30మంది మిస్సింగ్ అయినట్లు నిన్నటి నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చింది ఏపీ సర్కార్. విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 30మంది ఆచూకీ దొరకడం లేదని మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ప్రకటించారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్. ఎపీలో అంతర్జాతీయ విమానాశ్రయాలు లేవని.. విదేశాల నుంచి అంతర్జాతీయ విమానాశ్రంలో దిగిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రొటోకాల్ ప్రకారం టెస్ట్ లు చేసిన అనంతరమే పంపుతున్నారని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లోని ఎయిర్ పోర్టులలో కూడా మెడికల్ టీం లు, హెల్ప్ డెస్క్ లు ఉన్నాయని.. స్క్రీనింగ్, టెస్ట్ లు చేసిన తర్వాతనే పంపుతున్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చిన విశాఖపట్నం, పరిసర జిల్లాలకు చెందిన ముప్పై మంది జాబితాను పంపిందని తెలిపారు. వారందరూ ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నారు… వారిని వైద్య బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయని.. వందే భారత్ పధకం కింద విజయవాడ ఎయిర్ పోర్టుకు వచ్చే ప్రయాణికులను కూడా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల సూత్రాల ప్రకారం పరీక్షలు చేసి పంపుతున్నామనీ పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన 30 మంది ఆచూకీ దొరకడం లేదని మీడియాలో వచ్చిన వార్తలు అసత్యాలు, ఆధారరహిత కథనాలు అని కొట్టిపారేశారు.

Read more RELATED
Recommended to you

Latest news