అమరావతి : కోర్టు ధిక్కరణ కేసులో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్సులకు జైలు శిక్ష వేస్తూ తీర్పు ఇచ్చింది కోర్టు. రెండు వారాల పాటు జైలు శిక్ష విధిస్తూ ఏపీ హై కోర్టు తీర్పు ఇచ్చింది.
అయితే ఏపీ హై కోర్టు తీర్పు ఇవ్వడం తో.. క్షమాపణ కోరారు ఐఏఎస్సులు. క్షమాపణలు కోరడంతో జైలు శిక్ష తప్పించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని హైకో ర్టు ఆదేశించింది. సంక్షేమ హాస్టళ్లల్లో ప్రతి నెలలో ఓ రోజు వెళ్లి సేవ చేయాలని హై కోర్టు స్పష్టం చేసింది.
ఒక రోజు పాటు హాస్టల్లోని భోజనం ఖర్చులు భరించాలని ఐఏఎస్సులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏడాది పాటు హాస్టళ్లల్లో సేవా కార్యక్రమం చేపట్టాలన్న హైకోర్టు… పాఠశాలల్లో గ్రామ సచివాలయాల ఏర్పాటు చేయొద్దన్న హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల వైఖరిని కోర్టు ధిక్కరణగా భావించిన హై కోర్టు.. ఈ తీర్పు ఇచ్చినట్లు వెల్లడించింది.