విజయవాడలో ఇవాళ, రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

-

విజయవాడ మహా నగరం లో గురువారం ట్రాఫిక్‌ ఆంక్షలు నిర్వహించనున్నారు. గురువారం రాత్రి 10 నుంచి శుక్రవారం మధ్యాహ్నం 12 వరకు ఆంక్షలు విధించానున్నారు ట్రాఫిక్‌ పోలీసులు. తల్లి బిడ్డా వాహనాలు ప్రారంభం సందర్భంగా ట్రాఫిక్‌ మళ్లిస్తున్నారు విజయవాడ పోలీసులు. చెన్నై నుంచి విజయవాడ మీదుగా విశాఖ రాకపోకలను చీరాల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా దారి మళ్లించనున్నారు.

అలాగే ఏలూరు నుంచి హైదరాబాద్‌ వెళ్లే భారీ వాహనాలను హనుమాన్‌ జంక్షన్‌, నూజివీడు, జీ. కొండూరు, ఇబ్రహీంపట్నం BRTS నుండి రామవార్పడు కంట్రోల్ రూమ్ నుండి, రమేష్ హాస్పిటల్ నుండి, మహానాడు రోడ్డు జుంక్షన్ నుండి వాహనాలు వెళ్ళవచ్చని పేర్కొన్నారు ట్రాఫిక్‌ పోలీసులు. బెంజ్ సర్కిల్ టచ్ చేయకుండా వెళ్ళే విధంగా రూట్ మ్యాప్ ఉంటుందన్నారు. ఉదయం 8 గంటలనుండి బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ పూర్తిగా నిలిపి వాహనాలు రాకపోకలు నిలిపివేయడం జరుగుతుందని.. ట్రాఫిక్‌ పోలీసులు చెప్పారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు ట్రాఫిక్‌ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news