బల్కంపేట ఎల్లమ్మ బోనాల పై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. జులై 5 న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం జరుగుతుందని.. అదే రోజు నుంచి ఎల్లమ్మ బోనాలు ప్రారంభం కానున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. బల్కంపేట ఎల్లమ్మ అమ్మ వారికి 2.5 కిలోల బంగారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనం సమర్పిస్తుందని వెల్లడించారు. అలాగే.. బంగారు తాపడంతో రుద్రాక్ష మండపం నిర్మాణం నిర్మిస్తామని ప్రకటన చేశారు.
బల్కంపేట ఎల్లమ్మ అమ్మ వారి దర్శనానికి వచ్చే భక్తులకు 5 కోట్లతో మల్టి లెవెల్ పార్కింగ్ నూతన భవనం నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అలాగే 50 లక్షలతో 48 షాప్ లతో నూతన కాంప్లెక్స్, 36 లక్షలతో భారీ రేకుల షెడ్డు నిర్మాణం చేపడతామని ప్రకటన చేశారు. గత సంవత్సరం కరోన నియమ నిబంధనలు ఉన్న నేపథ్యంలో బల్కంపేట ఎల్లమ్మ ఉత్సవాలను సరిగాని నిర్వహించలేక పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి ఈ ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తామని ప్రకటన చేశారు.