ఏపీ ప్రభుత్వానికి మరో షాకిచ్చిన హైకోర్టు

-

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇవ్వడం కొత్త కాదు. వారానికి ఒకసారయినా ఏదో ఒక అంశం మీద ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడం హైకోర్టుకు పరిపాటిగా మారింది. తాజాగా ఇంటర్మీడియట్ ఆన్ లైన్ అడ్మిషన్లు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఏపీ హైకోర్ట్ ఈరోజు సస్పెండ్ చేసింది. విద్యార్థులకు ఛాయిస్ లేకుండా ప్రభుత్వమే విద్యార్థులకు కాలేజీలో సీట్లు కేటాయించడం మీద కొంత విద్యార్ధుల తరపున తల్లి తండ్రులు హైకోర్ట్ లో పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ పిటిషన్లని ఈరోజు విచారించిన హైకోర్ట్ ధర్మాసనం 10 రోజులపాటు జీవోను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జరీ చేసింది. ఇక విద్యార్థులు ఏ కాలేజీలో చేరాలనేది వారి ఇష్టానికి వదిలేయాలని పిటిషనర్లు కోరారు. వారికి కూడా కాలేజీలను ప్రభుత్వం ఎలా కేటాయిస్తుందని వారి తరపున న్యాయావాదులు వాదించారు. ఇక ఈ కేసుని నవంబర్ 10వ తేదీకి విచారణ నిమిత్తం వాయిదా వేసింది హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news