శభరిమల కొత్త మార్గదర్శకాలు…!

పండుగ సీజన్ ముందు శభరిమల వచ్చే భక్తులకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్… కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. పండుగ సీజన్ నవంబర్ 16 న ప్రారంభమవుతుందని పేర్కొంది. భక్తులందరూ తప్పనిసరిగా కోవిడ్ -19 నెగటివ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి అని స్పష్టం చేసింది. మాస్క్ లు ధరించాలి అని శానిటైజర్లను ఉపయోగించాలి అని స్పష్టం చేసింది. ఆలయ చరిత్రలో మొట్టమొదటిసారిగా, ఈ పండుగ కాలంలో భక్తులందరినీ వర్చువల్ విధానం ద్వారా క్యూ లైన్ ని కట్టడి చేస్తారు.

ఆలయానికి వారాంతపు రోజులలో రోజుకు 1,000 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. శని, ఆదివారాల్లో ప్రతిరోజూ 2 వేల మంది భక్తుల వరకు వచ్చే అవకాశం ఉంది. మండల-మకరవిలక్కు పూజ రోజుల్లో 5,000 మంది భక్తులకు దర్శనం లభిస్తుంది. డిసెంబరులో అన్ని రోజులు క్యూ స్లాట్లు పూర్తిగా బుక్ అయ్యాయి. నవంబర్ మరియు జనవరిలలో కొన్ని రోజులు కొన్ని స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 24 గంటల్లో కోవిడ్ సర్టిఫికేట్ ఉండాలి.