కోడిగుడ్ల ఉత్పిత్తిలో ఏపీ నెంబర్‌వన్‌

-

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి శుభవార్త.. కోడిగుడ్ల ఉత్పిత్తిలో ఏపీ నెంబర్‌వన్‌గా నిలిచినట్లు తాజాగా విడుదలైన కేంద్ర పశు సంవర్థక మంత్రిత్వ శాఖ సర్వే 2022 వెల్లడించింది. కోడిగుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ మూడో స్థానంలో ఉంటే.. మనదేశంలో నెంబర్ వన్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచిన విషయాన్ని తాజాగా విడుదల చేసిన సర్వేలో పేర్కొన్నారు. కోడిగుడ్ల లభ్యత, ఉత్పత్తిలో ఏపీ మొదటి స్థానంలో ఉండగా.. తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. దేశంలో మిగతా రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్‌లో తలసరి గుడ్ల లభ్యత అత్యధికంగా ఉందని.. ఏపీలో ఆంధ్రప్రదేశ్‌ ఏడాదికి తలసరి 501 గుడ్ల లభ్యతతో నంబర్‌–1 స్థానంలో ఉందని సర్వే వెల్లడించింది. గుడ్ల లభ్యతలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని సర్వే పేర్కొంది.

2020-21లో పెరటి కోళ్ల సంఖ్య 1,23,70, 740 ఉండగా.. 2021-22లో 1,31,69,200కు పెరిగినట్లుగా సర్వే వెల్లడించింది. కాగా.. కోడిగుడ్ల ఉత్పత్తి విషయంలోనూ దేశవ్యాప్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. కోడిగుడ్ల లభ్యతలో నాలుగో స్థానంలో ఉన్న తమిళనాడు గుడ్ల ఉత్పత్తిలో మాత్రం రెండో స్థానంలోను.. గుడ్ల లభ్యతలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ ఉత్పత్తిలో మాత్రం మూడో స్థానంలోనూ ఉన్నాయని సర్వే పేర్కొంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version