ఉక్రెయిన్- రష్యా యుద్ధ పరిణామాలు వల్ల అన్ని దేశాలపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా వంట నూనెల ధరలు చుక్కలను అంటుతున్నాయి. పాయమాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు రూ. 200కు చేరువవుతున్నాయి. ఇదిలా ఉంటే యుద్ధాన్ని కొంత మంది వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. పాత సరకునే పెరిగిన రేట్లకు అమ్ముతూ… క్యాష్ చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి వారి ఆట కట్టిస్తోంది ఏపీ ప్రభుత్వం.
ఇదిలా ఉంటే మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వంట నూనెల ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మున్సిపల్ మార్కెట్లు, సూపర్ బజార్లు, ప్రభుత్వ జౌట్ లెట్ల ద్వారా వంట నూనెలను విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది. 111 మున్సిపాలిటీలు, 34 కార్పొరేషన్లలో వంట నూనె విక్రయానికి ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న రేట్లను పరిశీలిస్తే… సన్ ఫ్లవర్ లీటర్ నూనెలకు రూ.191, వెరుశెనిగ నూనె రూ. 175, పామాయిల్ రూ. 155కు లభిస్తుంది. గడిచిన కొన్ని రోజుల్లోనే రూ. 40-50 వరకు నూనెల ధరలు పెరిగాయి.