ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు

Join Our Community
follow manalokam on social media

ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు పెడుతున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. 1 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు ఉంటాయని ఆయన అన్నారు. ఉదయం 7.45 నుంచి 12.30 వరకు తరగతులు.. తర్వాత మధ్యాహ్న భోజనం ఉంటుందని అన్నారు.

పాఠశాల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలన్న ఆయన ఎండలు, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నమాని అన్నారు. పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు అమలుపై అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నామని అన్నారు. విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహణ, మాస్కులు ధరించడం, సానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సురేష్ ఆదేశించారు.

TOP STORIES

కరోనా సెకండ్ వేవ్: యువతలో కనిపించే 6 అసాధారణ లక్షణాలివే..!

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. అయితే తాజాగా...