హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి బయల్దేరారు. కేంద్ర మంత్రులను, కార్యదర్శులను కలిసి నిధులు, అవసరమైన సహకారం కోరనున్నారు మంత్రి మేకపాటి. ఢిల్లీలోని లోధి హోటల్ లో మధ్యాహ్నం నుంచి వరుస సమావేశాలలో పాల్గొనున్నారు మంత్రి. భారత పర్యాటక అభివృద్ధి సంస్థ సీఎండీ కమల వర్ధన రావు, జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ సీఎండీ గురుదీప్ సింగ్,
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా & లిమిటెడ్ (SAIL) ఛైర్మన్ అనిల్ కుమార్ చౌదరి, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సీఎండీ నలిన్ సింఘాల్ తో మంత్రి మేకపాటి వరుస సమావేశాలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నైపుణ్యాభివృద్ధి, శిక్షణ గురించి వివరించి పర్యాటక తదితర రంగాలలో అవసరమైన సహకారాన్ని కోరనున్నారు మంత్రి గౌతమ్ రెడ్డి. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెంట నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవో అర్జా శ్రీకాంత్ కూడా ఢిల్లీ వెళ్తున్నారు.