ఇటీవల బీజేపీ హై కమాండ్ తీసుకున్న కీలక నిర్ణయాల ఫలితం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను మార్చడం జరిగింది, అందులో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి ఎన్నికయ్యారు. తాజాగా పురంధేశ్వరిపై వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తనదైన శైలిలో రెచ్చిపోయి మాట్లాడారు. రాష్ట్రంలో తీసుకువచ్చిన పథకాలు బీజేపీకి కనిపించడం లేదా అంటూ ఆమెను ప్రశ్నించారు అమర్నాధ్. ఈ దేశంలోనే ఒక రోల్ మోడల్ గా తీసుకునే విధంగా మా ప్రభుత్వం పథకాలను తీసుకువస్తోంది అంటూ మాట్లాడారు మంత్రి. మేము అధికారంలోకి వచ్చే ముందు ప్రజలాలు ఏవైతే హామీలను ఇచ్చామో వాటిని అన్నిటినీ నెరవేరుస్తూ ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టము అంటూ పురందేశ్వరిని ఉద్దేశించి అమర్నాధ్ కామెంట్ చేశారు. కేంద్రం రాష్ట్రాలకు నిధులను ఇస్తోంది తమ జేబులలో నుండి లేదా బీజేపీ పార్టీ ఫండ్ నుండో ఇవ్వడం లేదు. మా రాష్ట్రము నుండి వివిధ మార్గాలలో వెళుతున్న పన్నుల నుండి తీసి ఇస్తోందంటూ చురకలు అంటించాడు.
బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి రాష్ట్రంలో చంద్రబాబుకు అనుకూలంగా ఉంటుందని.. ఆయనకోసమే పని చేస్తోందని అభిప్రాయపడ్డారు మంత్రి అమర్నాధ్.