ఏపీ ఎమ్మెల్సీ ఫోన్ స్విచ్ ఆఫ్, మాకు తెలియదు అంటున్న పోలీసులు…!

-

రేపు చలో అంతర్వేది నేపథ్యంలో రాష్ట్రవ్యా ప్తంగా పలుచోట్ల బిజెపి నేతలను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి గానూ విశాఖపట్నం నుండి కాకినాడ బయలుదేరి వెళ్లారు బిజెపి ఎమ్మెల్సీ మాధవ్. సాయంత్రం నుంచి ఆయన ఫోన్ కి స్పందించడం లేదు. దీనితో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా అదుపులోకి తీసుకున్నారా అని తూర్పుగోదావరి పోలీసులను కుటుంబ సభ్యులు అడిగారు.మీరు తెమ్మంటనే మోడీ నీరు-మట్టి తెచ్చారు, అమరావతి ప్లాన్ మార్చాలి: టీడీపీకి  బీజేపీ షాక్ | BJP MLC Madhav versus TDP MLC in AP Assembly - Telugu Oneindia

దీనితో స్పందించిన పోలీసులు మాకు ఏ సమాచారం లేదని మాకు ఎం తెలియదు అని చెప్పినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతర్వేది రథం దహనం కార్యక్రమానికి సంబంధించి నిరసన తెలపడానికి గానూ ఏపీ బిజెపి నేతలు, జనసేన నేతలు భారీగా తరలి వెళ్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news