ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి నిన్నటితో ఒక ప్రక్రియ పూర్తి అయినట్టే, నిన్నటితో నామినేషన్స్ ఉపసంహరణ గడువు పూర్తయింది. దీంతో నిన్న ఎంత మంది బరిలో ఉండనున్నారు అనే విషయం క్లారిటీ వచ్చింది. ఇక ఎన్నికల సంఘం లెక్క ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 578 వార్డుల ఏకగ్రీవం అయ్యాయి.
రాష్ట్రంలో ఉన్న 2794 వార్డులకు గాను 578 వార్డులు ఏకగ్రీవమైనట్టు ఎస్ఈసీ వెల్లడించింది. అంటే మొత్తం వార్డుల్లో 20.68 శాతం ఏకగ్రీవాలు జరిగాయి. ఇక 570 వైసీపీకి ఏకగ్రీవం కాగా ఐదు వార్డులు టీడీపీ, ఒక వార్డ్ బీజేపీ, ఇద్దరు స్వతంత్ర అభ్యర్దులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక ఈ నెల పదవ తేదీన ఎన్నికలు జరగనుండగా సరిగ్గా నాలుగు రోజుల అనంతరం ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎలా అయినా అన్ని మున్సిపాలిటీలు గెలుచుకోవాలని అధికార వైసీపీ, సత్తా చాటాలని ప్రతిపక్ష టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.