రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న చివరి విడత గ్రామ పంచాయతీ పోలింగ్ లో గత మూడు విడతల కంటే పోలింగ్ శాతం భారీగా పెరుగుతోంది. ఉయం 10.30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 41.55 పోలింగ్ శాతం నమోదయింది. ఇక మొదటి నాలుగు గంటలకే 50 శాతం మార్క్ దాటి విజయనగరం జిల్లా దూసుకు పోతోంది. విజయనగరం జిల్లాలో అత్యధిక పోలింగ్ శాతం నమోదు కాగా నెల్లూరు జిల్లాలో అత్యల్ప పోలింగ్ నమోదయింది.
పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుంచి గిరిజా శంకర్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ కొనసాగుతోంది. ఒక్కో జిల్లా బాధ్యత ఒక్కో అధికారికి అప్పగించి వెబ్ కాస్టింగ్ ఇన్ పుట్స్ మానిటరింగ్ చేయిస్తున్నారు. గత మూడు విడతల కంటే ఈసారి మొదటి రెండు గంటల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు అయ్యిందని సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల పై ఎక్కువ నిఘా పెట్టామని కమిషనర్ పేర్కొన్నారు. మూడు, నాలుగు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని ఆయన అన్నారు. ఇక జిల్లాల వారీ పోలింగ్ శాతం ఈ మేరకు ఉంది.
- శ్రీకాకుళం 36.84
- విజయనగరం 54.7
- విశాఖ 48.94
- ఈస్ట్ గోదావరి 35.85
- వెస్ట్ గోదావరి 34.62
- కృష్ణా 36.47
- గుంటూరు 41.25
- ప్రకాశం 40.05
- నెల్లూరు 33.94
- చిత్తూరు 43.58
- కడప 40.69
- కర్నూలు 46.83
- అనంతపురం 46.36